Posts

మధ్యప్రదేశ్ నుంచి నడుస్తున్న జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అదనంగా మరో రెండు సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్యఎం సింధియా ప్రారంభించారు.

Image
 వర్చువల్ విధానంలో భోపాల్ నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ మంత్రులు  శ్రీ ప్రధమాన్ సింగ్ తోమర్, శ్రీ భరత్ సింగ్ కుష్వాహా, లోక్ సభ సభ్యుడు శ్రీ వివేక్ నారాయణ షెజ్వాల్కర్, గ్వాలియర్ ఈస్ట్ శాసనసభ సభ్యుడు డాక్టర్ సతీష్ సికర్వార్ వర్చువల్ విధానంలో  గ్వాలియర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ‌లో న్యూట్రి గార్డెన్ ను ప్రారంభించిన కేంద్ర మ‌హిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి

Image
 నెల‌రోజులపాటు సాగే పోష‌ణ్ మాహ్ 2021లో భాగంగా కేంద్ర మ‌హిళా , శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆమె, దేశ పౌష్టికాహార అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఎంత మెరుగుగా ఉప‌యోగించుకోవ‌చ్చునన్న‌దానిని తెలియ‌జెప్ప‌డ‌మే ప్ర‌స్తుత అవ‌స‌ర‌మని కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని అన్నారు. 2021 పోష‌ణ్ మాహ్‌ను ఈరోజు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఆయుర్వేద (ఎఐఐఎ) వ‌ద్ద ప్రారంభిస్తూ ఆమె న్యూట్రి గార్డెన్‌ను ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌ష్ శాఖ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ ముంజ‌ప‌ర మ‌హేంద్ర భాయ్ , మ‌హిళా శిశు అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రి కూడా పాల్గొన్నారు. మున‌గ‌, ఉసిరి మొక్క‌ల‌ను కూడా ఇరువురు మంత్రులు నాటారు. న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఆదేశాల మేర‌కు పోష‌ణ్ మాహ్ 2021 ఉత్స‌వాల‌ను ప్రారంభించింది. 

చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రంపై జిజ్ఞాసను పెంచేలా చొరవతీసుకోవాలి

Image
 వాతావరణ సమస్యలు మొదలుకొని వ్యవసాయం, వైద్యం, ఔషధ రంగం వరకు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల దిశగా విస్తృతమైన పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం బెంగళూరులోని జవహార్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్)ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. అనంతరం విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పరిశోధనలు జరగాలన్నారు.